Posts

Trips- 1 Kodugu, Talakaveri, Bhagamandala, PayaNa etc Nov 2024

Image
కొడగు, తలకావేరి, భాగమండలి, సోమనాథపుర కేశవాలయం, చాముండేశ్వరి ఆలయం, పయన/ణ November 2024   Somnathapura Kesava Temple, Karnataka అది చెన్న కేశవాలయం కాదట --చెన్న అంటే కనడంలో స్త్రీత్వమట -చెన్న కేశవాలయం ఇంకో చోట ఉందట. పొలిమేర దాటిపోతున్నా గువ్వల చెన్నా....... గుర్తుకు వచ్చింది గైడ్ చెపుతుంటే. మొదటిసారి చెల్లి బావలతో వెళ్ళినపుడు రద్దీ లేకుండా ఉండటం, కమర్షియల్ హంగులు లేకపోవటంతో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను వంటరిగా.  https://en.wikipedia.org/wiki/Chennakeshava_Temple,_Somanathapura మా బెంగళూరునుంచి రెండుగంటలకు పైగా పట్టింది. On the way షివల్లిలో కొడుబు ఇడ్లీ భలే ఉంది

విశ్రాంత జీవితం నుంచి అనంత విశ్రాంతి వరకు

పరుగు వేగం తగ్గుతోంది కానీ విశ్రామం భయపెడుతుందేమొనని కొంత బెరుకు పరుగు ఫలమిపుడేగా నీవు అనుభవించేదీ అంటూ బుధ్ధి కొంతకలగలపుకూరగా మనసు వెరసి ఇంకో రకపు పయనం మొదలయింది. పిల్లలకోసం అక్కడుండిపోయినా అమ్మ కోసం తిరిగొచ్చినా పరాయి భాష, పరాయి సంస్కృతి ఇరవయ్యేళ్ళ గతం ఇంకో పదిహేనేళ్ళ భవిత భవితకూ గతానికీ స్వాహా అప్పటికి కాని వర్తమానానికి విముక్తి రాదు