విశ్రాంత జీవితం నుంచి అనంత విశ్రాంతి వరకు
పరుగు వేగం తగ్గుతోంది
కానీ విశ్రామం భయపెడుతుందేమొనని కొంత బెరుకు
పరుగు ఫలమిపుడేగా నీవు అనుభవించేదీ అంటూ బుధ్ధి
కొంతకలగలపుకూరగా మనసు
వెరసి ఇంకో రకపు పయనం మొదలయింది.
పిల్లలకోసం అక్కడుండిపోయినా
అమ్మ కోసం తిరిగొచ్చినా
పరాయి భాష, పరాయి సంస్కృతి
ఇరవయ్యేళ్ళ గతం
ఇంకో పదిహేనేళ్ళ భవిత
భవితకూ గతానికీ స్వాహా
అప్పటికి కాని వర్తమానానికి విముక్తి రాదు
Comments
Post a Comment